
- లేదంటే సోనియా గాంధీకి లక్షలాది పోస్టు కార్డులను పంపుతం : కవిత
హైదరాబాద్, వెలుగు: మహిళా దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలని బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మహిళలను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ సర్కారును మట్టికరిపిస్తామని ఆమె హెచ్చరించారు. వరంగల్లో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయాని కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలన్నారు.
సోమ వారం ఆమె తన నివాసంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించి.. సీఎం రేవంత్ రెడ్డికి పది వేల పోస్టు కార్డులను పంపించారు. మార్చి 8 నాటికి సీఎం రేవంత్ స్పష్టమైన ప్రకటన చేయ కపోతే.. 10 వేల మంది మహిళలం 10 వేల గ్రామాలకు వెళ్తామని, అన్ని గ్రామాల్లోని మహిళలను కూడగట్టి సోనియా గాంధీకి లక్షలాది పోస్టు కార్డులను పంపిస్తామని పేర్కొన్నారు.