న్యూఢిల్లీ: ప్రభుత్వ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్ట్ టు డివైజ్ (డీ2డీ) శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్‌లను లాంచ్ చేసింది. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుతాయి. అందువలన మారుమూల ప్రాంతాల్లో ఉన్నా కనెక్టివిటీ పోతుందనే భయపడాల్సిన పనిలేదు. ఇండియాలో మొదటి శాటిలైట్ టు డివైజ్ సర్వీస్ ఇదేనని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ (డాట్) ఎక్స్‌లో పేర్కొంది.
యూఎస్ కంపెనీ వైశాట్‌తో కలిసి బీఎస్‌ఎన్‌ఎల్ ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది. శాటిలైట్ డీ2డీ సర్వీస్‌లతో వైఫై కనెక్టివిటీ, సెల్యూలర్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా యూజర్లు ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవచ్చని, ఎస్‌ఎంఎస్ పంపుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది. అత్యవసరం కాని పరిస్థితుల్లో కాల్స్, ఎస్‌ఎంఎస్ చేసుకోవడంపై క్లారిటీ ఇవ్వలేదు.