కేసీఆర్​ సారూ.. మునుగోడు ఉప ఎన్నిక హామీలెక్కడ‌‌?–బీఎస్పీ నేత ప్రవీణ్​ కుమార్​

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఆరునెలల క్రితం 160 గ్రామాలకు గాను 139 గ్రామాలు తిరిగానని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మే 7న జరిగే  ఛలో హైదరాబాద్ తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ అంబేద్కర్  పేరుతో సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్...తెలంగాణ పునర్నిర్మాణం అంటే కూలిపోయే ప్రాజెక్ట్ లు కట్టడమా అని ప్రశ్నించారు. పునర్నిర్మాణం అంటే అంటే ఒక తరాన్ని కాపాడాలన్నారు.

దళితబంధులో వెయ్యి కోట్ల స్కాం
 
తెలంగాణ ప్రజలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని డిమాండ్​ చేశారు. కొత్త సచివాలయంలోకి మీడియాను ఎందుకు అనుమతించలేదో వివరించాలన్నారు. దళితబంధు విషయంలో ఒక్కోఎమ్మెల్యే మూడు లక్షలు కమిషన్ తీసుకుంటున్నా...సీఎం కేసీఆర్​ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రవీణ్​ కుమార్​ ప్రశ్నించారు. ఈ స్కీంలో వెయ్యి కోట్లు కుంభకోణం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి అబద్దాలు చెప్పే సీఎం అవసరంలేదన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తెలంగాణ బిడ్డల్ని ఓదార్చేందుకు బీఎస్పీ అధ్యక్షురాలు  మాయావతి  తెలంగాణకు వస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్​ కుమార్​ తెలిపారు. 

సోలిపురం బ్రిడ్జి ఏమైంది?

ఉప ఎన్నికల సమయంలో మునుగోడును కేటీఆర్​ దత్తత తీసుకుంటానని ఆ తరువాత మర్చిపోయారని ప్రవీణ్​ కుమార్​ అన్నారు. గట్టుపల్ పార్మా కంపనీని రద్దు చేస్తున్నామని ఇప్పడు మాట తప్పారని బీఎస్పనేతలు అన్నారు. జూనియర్​, డిగ్రీ కాలేజీల హామీ, రాచకొండ పోడు భూముల సమస్య,చండూర్ రెవెన్యూ డివిజన్ వంటి అంశాలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. ఉప ఎన్నికల్లో నాయకులు ఇచ్చిన హామీలు పత్రిక ప్రకటనలుగా మిగిలాయన్నారు.  సోలిపురం బ్రిడ్జి పూర్తి చేస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదన్నారు.