తెలుగు కోడలు నిర్మలమ్మకు.. తెలంగాణపై ప్రేమ లేదు.. కేంద్ర బడ్జెట్​ లో తెలంగాణకు గాడిద గుడ్డు

తెలుగు కోడలు నిర్మలమ్మకు.. తెలంగాణపై ప్రేమ లేదు.. కేంద్ర బడ్జెట్​ లో తెలంగాణకు  గాడిద గుడ్డు

తెలుగింటి కోడలు.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్​ వరుసగా 8వసారి బడ్జెట్​ ప్రవేశపెట్టారు.  తెలుగు కోడలైనా కాని.. తెలంగాణ ప్రేమ చూపలేదని టీపీసీస చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు.  ఈరోజు ( ఫిబ్రవరి 1)  ప్రకటించిన బడ్జెట్​ లో తెలంగాణకు నిర్మలా సీతారామన్​ గాడిదగుడ్డు బడ్జెట్​ కేటాయించారన్నారు. కేంద్ర బడ్జెట్​ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు.  ఈ బడ్జెట్​  కేవలం బీహార్​ ఎన్నికల కోసమేనంటూ.. అందుకే బీహార్​ నజరాణాలు ప్రకటించారని టీపీసీసీ చీఫ్​ మహేహ్​ కుమార్​ గౌడ్​ అన్నారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతుందని.. రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయాలని చూస్తుందని టీపీసీసీ చీఫ్​ తెలిపారు.  50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ  పెట్టిన కేంద్రం తెలంగాణ ఒక్క పైసా కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.  త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం తో అక్కడ రాజకీయ లబ్ది కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుందని... దేశం మొత్తం ప్రజల నుంచి వసూలు చేసే బడ్జెట్ లో అందరికి సమానంగా  ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ నుంచి 40 వేల కోట్ల రూపాయిలు  జీఎస్టీ   కేంద్రానికి కడుతున్నామని.. కాని తెలంగాణకు బడ్జెట్ లో నిధులను ఎందుకు కేటాయించలేదన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఉండటంతో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో   వివక్ష చూపడం అన్యాయన్నారు. 

ALSO READ | మరీ ఇంత అన్యాయమా..? కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఏం ఆశించింది..? కేంద్రం ఏం చేసింది..?

నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ అప్పారావు గారి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న పదాలను వాడారు.. మరి తెలంగాణ ప్రజలు దేశంలో మనుషులు కారా.. అని నిర్మలమ్మను సూటిగా ప్రశ్నించారు.  తెలంగాణ కు ఎన్నికల సమయంలో ప్రధాని మంత్రి, బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారన్నారు.  

సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీ లు కేంద్ర మంత్రులను, ప్రధాన మంత్రిని కలిసి తెలంగాణ కు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తి చేసినా.. బీజేపీ మాత్రం స్వార్థ పూరితంగా వ్యవహరించిందన్నారు.  తెలంగాణలో  రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టుకు  జాతీయ హోదా, ఐటీఐఆర్, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం లాంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నా కూడా కనీసం వాటి పేరును కూడా ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్రం ... తెలంగాణ కు అవసరమైన అంశాలలో సహకారాన్ని అందించాలని కోరారు.