![Apple iPhone 15: గ్రేట్ ఆఫర్..రూ.30వేలకే ఐఫోన్..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో](https://static.v6velugu.com/uploads/2025/02/buy-apple-iphone-15-256gb-at-rs-30000_G6Eod83eyX.jpg)
ఐఫోన్ కొనాలనుకుంటున్నారా..ఐఫోన్ కొనుగోలుపై మంచి ఆఫర్లకోసం ఎదురుచూస్తున్నారా..ఎప్పుడు ధరలు తగ్గుతాయని చూస్తున్నారా.. ఆ సమయం వచ్చేసింది.. ఇప్పుడు 256GB స్టోరేజ్ తో iPhone 15 అతి తక్కువ ధరలో లభిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
iPhone 15 హ్యాండ్ సెట్ అసలు ధర రూ.79వేల 900లు. ఇప్పుడు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫాం ఫ్లిప్ కార్ట్ లో సగం ధరకే లభిస్తోంది. డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లతో కలిపి 256GB స్టోరేజీతో iPhone 15 ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.
iPhone 15 256GB వేరియంట్ అధికారిక ధర రూ.79,900, అయితే ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ 12 శాతం తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ నేరుగా రూ.9,901 తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.69,999లు.ఇక ఎంచుకున్న బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లతో అదనపు డిస్కౌంట్ పొందవచ్చు .దీంతో ధర మరింత తక్కువగా ఉంటుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత డిస్కౌంట్ లభిస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో అమ్బడం ద్వారా రూ.39వేల150 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. మీ పాత పరికరం గరిష్ట మార్పిడి విలువకు అర్హత పొందినట్లయితే, iPhone 15 రూ. 30వేల849లకే లభిస్తోంది.
అన్ని ఆఫర్ల తర్వాత బ్యాంక్ ,ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో కలిపి రూ. 30వేల కంటే తక్కువ ధరకే iPhone 15 హ్యాండ్ సెట్ ను సొంత చేసుకోవచ్చు.
iPhone 15 స్పెసిఫికేషన్లు..
- ఈ హ్యాండ్ సెట్ 6.1-అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేతో డాల్బీ విజన్‌కు సపోర్టు చేస్తుంది.
- Apple A16 బయోనిక్ చిప్‌సెట్ - గేమింగ్, మల్టీ టాస్కింగ్ కు బాగుటుంది.
- ఇందులో కెమెరా సెటప్ అద్బుతం.. 48MP + 12MP డ్యూయల్ కెమెరా ఉంటుంది. అద్భుతమైన ఫోటోల కోసం హై-రిజల్యూషన్ ప్రైమరీ కెమెరా ఉటుంది. క్రిస్టల్-క్లియర్ వీడియో కాల్స్ కోసం 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ కూడా ఎక్కువ కాలం వస్తుంది. 3349mAh బ్యాటరీ సెటప్.. ఎక్కవ సమయం పనితీరు కోసం ఫాస్ట్ ఛార్జింగ్,వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.
- ఇక వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కోసం IP68 ఉంటుంది.
- స్టోరేజ్ విషయానికి వస్తే.. 6GB RAM, 512GB వరకు స్టోరేజీతో చేసుకోవచ్చు.
- మొత్తం మీద iPhone 15లో ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఎక్ఛేంజ్ లో మంచి ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.