
- ఫిర్యాదులకు ఫోన్ నెం: 08662466877 మెయిల్ ఐడి: apsec.callcenter@gmail.com
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీలు, ప్రజల నుండి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు స్వీకరించి స్పందించేందుకు విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేశారు.
రాజకీయ పార్టీలే కాదు ప్రజలు ఎవరైనా నేరుగా ఫోన్ చేసి తెలియజేసేందుకు వీలుగా ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేసింది. విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ కాల్ సెంటర్ నిరంతరం పనిచేస్తుంది. ప్రజలు తమ ఫిర్యాదులను ఫోన్ నెం: 08662466877 కు ఫోన్ చేసి తెలియచేయాలని సూచించింది. తగిన ఆధారాలతో నిర్దిష్టంగా ఫిర్యాదు చేస్తే వేగంగా స్పందించి చర్యలు తీసుకునే వీలుంటుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
అంతేకాదు ఆధారాలను లిఖితపూర్వకంగా తెలియజేసేందుకు ఈ మెయిల్ ను అకౌంట్ కు కూడా పంపొచ్చని తెలియజేసింది. కాల్ సెంటర్లోని ఈ మెయిల్ ఐడి: apsec.callcenter@gmail.com ఫిర్యాదులు పంపితే నమోదు చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ వివరించింది.