లగచర్ల కేసు నాంపల్లి స్పెషల్ కోర్టుకు బదిలీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: లగచర్ల ఘటనపై నమోదైన కేసులు నాంపల్లిలోని స్పెషల్ కోర్టుకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ అయ్యాయి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులను నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారించనుంది. గతంలో హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టు జడ్జీ ఈ కేసులను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ చేశారు. 

లగచర్లలో భూసేకరణ విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింగ్యానాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా ప్రభుత్వ అధికారులపై స్థానికులు దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఇతరులను నిందితులుగా చేర్చారు. కాగా నిందితుల బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం దాఖలైన పిటిషన్లపై కూడా నాంపల్లి కోర్టులోనే విచారణ జరగనుంది.