ఒకటివీ యాడ్ లో వదిన, మరదలు కలిసి షాపింగ్ కు వెళ్తారు. వదినకు చెప్పులు కొనాలి. చెప్పుల షాపతను మేడమ్! మీ కాలు చూపించండి అంటారు. వదిన చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే, ఆమె పాదాలు పగిలిపోయి. ఉంటాయి. ముఖ్యంగా మడమ భాగమంతా ఎక్కడికక్కడ పగిలిపోయి కనిపిస్తుంది. ఇలా ఎందుకవుతుంది? కాలి మడమలు ఎందుకు పగుల్తాయ్?
పెద్దవాళ్లు.. చిన్నవాళ్లు అని తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టే ఒక సమస్య అధికాళ్లు (ముఖ్యంగా మడములు) పగిలిపోవడం. ఇది కాళ్లకు వచ్చే ఒక సాధారణ చర్మ సమస్య కొంతమందికి మడమలు పగిలినా ఏ ఇబ్బందీ ఉండదు. చెప్పులు. షూస్ లేకుండా తిరిగినప్పుడు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొంతమందికి ఈ సమస్య మెల్లిగా పెరుగుతూ, నడిస్తేచాలు నొప్పి పెడుతుంది.
ఎందుకు పగుల్తాయి
కాలి మడమ భాగమంతా పొడిగా ఉన్నప్పుడు బాగా నడిస్తే ఇక్కడి చర్మమంతా సాగి పగుళ్లు వస్తాయి. ఇదొక ప్రధాన కారణం. ఇవి కాకుండా ఇంకా చాలా కారణాలున్నాయి.
- ఎక్కువసేపు నిలబడి ఉండటం
- చెప్పులు లేకుండా ఎక్కువసేపు నడవడం
- ఎక్కువసేపు స్నానం చేయడం ...నీళ్లలో నానడం
- కరుకుగా ఉండే సబ్బులు వాడటం
- వాతావరణ మార్పుల (ముఖ్యంగా శీతాకాలాలు) వల్ల చర్మం పొడిబారడం.
ఈ కారణాలన్నీ కూడా అరికాళ్లు పగలడానికి కొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు. మాయిశ్చరైజరు అవసర మున్నప్పుడల్లా వాడితే ఈ పగుళ్లు రాకుండా పాదాలను కాపాడుకోవచ్చు.
కొన్ని అనారోగ్య సమస్యలు కూడా..
- కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు కూడా పాదాలు పగలడానికి కారణమవుతాయి
- షుగర్ లెవెల్స్ పెరిగితే, రక్తప్రసరణ వేగం తగ్గి, పాదాలు పొడిగా మారిపోతాయి. ఈ పరిస్థితుల్లో కాలి మడమలు పగలే ప్రమాదం ఎక్కువ ఉంది.
- గర్భిణీగా ఉన్నప్పుడు కాళ్లు పగలడం ఎక్కువగా కనిపిస్తుంది.
- సోరియాసిస్, విటమిన్ లోపం, ఫంగల్ ఇన్ఫెక్షన్ , హైపోథైరాయిడిజమ్, డెర్మటైటిస్, ఒబెసిటీ. వయసు మీద పడటం వల్ల కూడా కాళ్ల పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది
ఏమవుతుంది?
- పాదాలు పగిలిపోవడం చాలాకాలం అలాగే ఉంటే, అది కొన్ని సమస్యలకు దారి తీయొచ్చు.
- దురదపెట్టడం, నొప్పిగా ఉండటు రక్తస్రావం, చర్మం ఎర్రగా మారిపోవడం, అల్సర్... ఇవన్నీ పాదాలు పగిలి, కొంతకాలం అలాగే ఉంటే వచ్చే సమస్యలు. అందుకే కాళ్లు పగులుతున్నట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా ట్రీట్ మెంట్ మొదలుపెట్టాలి.
ట్రీట్ మెంట్ ఏంటి?
- చికిత్స కంటే నివారణ మేలు అని చెబుతుంటారు అలాగే పాదాలు పగలకుండా జాగ్రత్తగా ఉండాలి.
- చికిత్స విషయానికి వస్తే ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ రాస్తూ ఉండటం మంచి పరిష్కారం.
- పాదాలు, మడమలు వగలడాన్ని ముందే గుర్తించొచ్చు. అలా గుర్తించిన వెంటనే రోజుకు రెండు మూడు సార్లు మాయిశ్చరైజర్ రాస్తే పగుళ్లు రాకుండా చూసుకోవచ్చు.
- ఒకవేళ పగుళ్లు ఎక్కువ ఉంటే ముందు ఉన్న చర్మాన్ని ముందు పమిస్ స్టోన్ తో రుద్ది.. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే ఫలితం ఉంటుంది.
ఇవి చేయండి
- రోజూ మడమ భాగంలో హీల్ బామ్ రాస్తూ ఉంటే మంచిది.
- మీ మడమపై ఒత్తిడి పెంచకుండా, ఎక్కువ గా ఎక్సపోజ్ అవ్వకుండా ఉండే షూస్ వేసుకోవాలి.
ఇవి చేయకండి
- ఫ్లిప్ ప్స్, సాండల్స్ వేసుకోవద్దు. మడమ భాగానికి ఇవ్వాల్సిన సపోర్ట్ వెనుక వైపు ఓపెన్ ఉండే షూస్ వాడకండి.
- మడమ భాగంలో వెడల్పు.. తక్కువ ఉండే షూస్ వేసుకోకండి.
- మరీ టైట్ గా ఉండే షూస్ వేసుకోవద్దు.
ఇవి చేస్తే పగుళ్లు ఉండవు!
- చాలాసేపు ఒకేదగ్గర కూర్చోకండి, కాలిపై కాలు వేసుకొని ఎక్కువ సేపు కూర్చోవద్దు.
- మాయిశ్చరైజర్ వాడటమే కాకుండా, దాన్ని కవర్ చేస్తూ సాక్స్ లు.. షూస్ వేసుకోండి..
- రోజూ అరికాళ్లను చెక్ చేసుకుంటూ ఉండండి. డయాబెటిస్ ఉంటే మరింత జాగ్రత్త అవసరం.
- మడమ భాగానికి సరిగ్గా సరిపడేలా కొన్ని షూ ఫిటింగ్స్ ఉంటాయి. అవసరమైతే అవి వేసుకోండి.
- ఏది పడితే అది కాకుండా, మంచి సాక్స్ లు వాడండి.
- చర్మం పొడిబారొద్దంటే నీళ్లు బాగా తాగాలని గుర్తుంచుకోండి.
-వెలుగు,లైఫ్-