
కాశీబుగ్గ(కార్పొరేషన్)/ వరంగల్ సిటీ, వెలుగు: పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని సీడీఎంఏ డాక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. గురువారం రాష్ట్రవ్యాప్త మున్సిపల్ కమిషనర్లు అధికారులతో హైదరాబాద్ నుంచి పన్ను వసూళ్ల పురోగతి పై నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో సీడీఏంఏ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. బల్దియా ఆఫీస్ నుంచి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొని ఇప్పటివరకూ జరిగిన పన్ను వసూళ్ల పురోగతిని వివరించారు.
ఈ సందర్భంగా సీడీఎంఏ మాట్లాడుతూ మార్చి 31 లోగా వంద శాతం పన్ను వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కమిషనర్ శానిటేషన్ పనులపై ఆకస్మిక తనిఖీ చేశారు. ఏడో డివిజన్ పరిధి మెయిన్ రోడ్ హనుమకొండ బస్టాండ్ ప్రాంతాల్లో తనిఖీలు చేసి శానిటేషన్ నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని, సిబ్బంది వర్క్ లు క్లీనింగ్ తోపాటు డ్రైన్ లు క్లీనింగ్ చేసిన క్రమంలో స్థానికుల సంతకాలు తీసుకొని లాగ్ బుక్ లో నమోదు చేయాలన్నారు.