మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన

మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన
  • పర్మిషన్ ​కోసం మున్సిపల్ శాఖకు సీడీఎంఏ లేఖ

హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు అనుమతి ఇవ్వాలని మున్సిపల్ శాఖకు సీడీఎంఏ ( కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ ) టీకే శ్రీదేవి లేఖ రాశారు. ఈ నెల 26న రాష్ట్రంలో 129 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు  ముగియనుంది. 27 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం కావాలి. అయితే, గ్రామ పంచాయతీల టర్మ్ ముగిసి ఏడాది కావస్తున్నా బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేక ఎన్నికలపై నిర్ణయం తీసుకోలేదు.

దీంతో మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉండడం, ఇటీవల రాష్ట్రంలో 12 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు, హైదరాబాద్ శివారు గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో కలపటంతో మున్సిపల్ ఎన్నికలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మున్సిపల్ శాఖ సీఎం రేవంత్ దగ్గర ఉంది. ప్రస్తుతం ఆయన దావోస్ పర్యటనలో ఉండటంతో ఈ నెల 24న రాష్ట్రానికి చేరుకున్న తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో 25న స్పెషల్ ఆఫీసర్ల పాలనపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నాయి.