Viral Video: క్లాస్ రూంలో స్టూడెంట్పై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. వీడియో వైరల్

క్లాస్ రూం అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. సీరియస్ గా క్లాస్ చెబుతుంది టీచర్..విద్యార్థులంతా శ్రద్ధగా వింటున్నారు..ఇంతలో ఏదో పైనుంచి ఊడిపడినట్టు శ బ్ధం.. అందరూ శబ్ధం వచ్చిన వైపు చూశారు.. పైనుంచి సీలింగ్ ఫ్యాన్ ఊడి ఓ స్టూడెంట్ పై పడింది. ఫ్యాన్ రెక్కలు తగిలి విద్యార్థికి గాయాలయ్యాయి. స్కూల్ యాజ మాన్యం నిర్లక్ష్యంగా కారణంగా ఓ విద్యార్థిని ఆస్పత్రి పాలైంది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లాస్ రూంలో ఫ్యాన్  ఊడిపడట మేంటీ.. ఇంత నిర్లక్ష్యమా.. అంటూ నెటిజన్లు మండిపడ్డారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఈ భయానక ఘటన మధ్యప్రదేశ్ లోని సెహోర్ లో జరిగింది. ఓప్రైవేట్ స్కూల్ లో టీచర్ పాఠాలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా ఊడి పడిన సీలింగ్ ఫ్యాన్ బేడ్ తగడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. బాలిక తన చేతిని అడ్డంపెట్టడంతో ఆమె ముఖానికి గాయాలు కాలేదు. ఈ దురదృష్టకరమైన సంఘటనలో బాలిక స్వల్ప గాయాలో బయటపడింది. ఈ ఇదంతా క్లాస్ రూంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.  

ఈ ఇన్సిడెంట్ స్కూళ్లలో మెయింటెనెన్స్ పై పలు ఆందోళనలకు దారితీసింది.ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల ప్రతిరోజు స్కూల్ ప్రాపర్టీస్ మెయింటెనెన్స్ తప్పనిసరిగా చేయాల్సిన అవసరాన్ని  ఈ ఘటన గుర్తు చేస్తుంది.