ప్రజాస్వామ్యంలో ఓటు విలువైనది

ప్రజాస్వామ్యంలో ఓటు విలువైనది
  • ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి
  • ఓటర్​ అవగాహన ర్యాలీలో కలెక్టర్​ రాహుల్​ రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: ప్రజామ్యంలో ఓటు విలువైనదని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్​రాహుల్​రాజ్​సూచించారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సావాన్ని పురస్కరించుకొని ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ..18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలోని స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించే ఓటర్​క్యాంపెయిన్లు, ఎన్నికల కమిషన్ పోర్టల్, ఓటరు యాప్, 1950 టోల్ ఫ్రీ నంబర్, బూత్ స్థాయి కేంద్రాల ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు.

 ఓటర్​కార్డులో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే చేసుకోవచ్చన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి మండలంలో ఓటుపై అవగాహన కల్పించామన్నారు. అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి, సీనియర్​సిటిజన్లను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్​నగేశ్, ఆర్డీవో రమాదేవి, ఏఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్​, డీఆర్​వో భుజంగరావు, డీఎస్​వో రాజిరెడ్డి, డీటీ నవీన్, క్రీడల అధికారి నాగరాజు, తహసీల్దార్​ లక్ష్మణ్ బాబు, సీనియర్ సిటిజన్స్, స్టూడెంట్స్​ పాల్గొన్నారు.

ఓటు విలువ తెలుసుకోవాలి: కలెక్టర్​ మనుచౌదరి

సిద్దిపేట టౌన్ : యువత ఓటు విలువ తెలుకోవాలని, ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు. సిద్దిపేటలోని ఆర్డీవో ఆఫీసులో నిర్వహించిన ఓటర్​దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాస్టర్ ట్రైనర్ అయోధ్య రెడ్డి అందరితో ఓటర్ల​ప్రతిజ్ఞ చేయించారు. 

అనంతరం కలెక్టర్​మాట్లాడుతూ.. కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫాం-6, అడ్రస్ మార్పు కోసం ఫాం-8 నింపాలని యువతకు సూచించారు.  స్టూడెంట్స్​ఇంట్లో తల్లిదండ్రులకు ఓటు విలువ గురించి చెప్పి, ఎన్నికల్లో ఓటు వేసే విధంగా ప్రోత్సహించాలన్నారు.  వివిధ స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన స్టూడెంట్స్, మహిళలకు, గ్రామ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన బీఎల్ వోలకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, డిప్యూటీ కలెక్టర్ గీత, తహసీల్దార్​సలీం, మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ 
పాల్గొన్నారు.

దేశ భవిష్యత్​ యువత చేతుల్లో : కలెక్టర్​ క్రాంతి

సంగారెడ్డి: దేశ భవిష్యత్​ యువత చేతుల్లోనే ఉందని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్​గా నమోదు చేసుకోవాలని కలెక్టర్​క్రాంతి సూచించారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్​లో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో 18 నుంచి 21 సంవత్సరాల యువత 4 శాతం ఓటర్లుగా ఉండాలని జనాభా లెక్కలు చెబుతున్నాయన్నారు. 

అనంతరం స్టూడెంట్స్​, ఉద్యోగులతో ఓటర్​ప్రతిజ్ఞ చేయించారు. సీనియర్ సిటిజన్లను సన్మానించారు. అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్ ఓటర్​అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్​వో పద్మజారాణి, డీఆర్డీఏ పీడీ జ్యోతి, డీపీవో శివప్రసాద్, తుల్జా నాయక్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఏవో పరమేశ్, ఎన్నికల సూపరింటెండెంట్ ఆంటోనీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.