ఆరు గంటల్లో కేసు రిజిస్టర్ చేయండి : కేంద్రం

న్యూఢిల్లీ: కోల్‌‌‌‌కతా వైద్యురాలి ఘటనపై ఆందోళనలు తీవ్రమవుతు న్న క్రమంలో కేంద్రం..శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్లు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తల పై దాడి జరిగిన 6 గంటల్లోపు పోలీసులు కేసు పెట్టాలని చెప్పింది. నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే.. సంబంధిత హాస్పిటల్ హెడ్ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

ఈ మేరకు అన్ని హాస్పిటల్స్​కు మెమో జారీ చేసింది. డాక్టర్లు, సిబ్బందిపై దాడులు కామన్ అయిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. ఎవరు బెదిరించినా.. దాడి చేసినా.. సహించేది లేదని స్పష్టం చేసింది.