నీతి ఆయోగ్​ పునర్వ్యవస్థీకరణ

నీతి ఆయోగ్​ పునర్వ్యవస్థీకరణ

కేంద్ర ప్రభుత్వంలో కొత్త మంత్రివర్గం ఏర్పడిన నేపథ్యంలో నీతి ఆయోగ్​ను కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. 

చైర్​ పర్సన్​:  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
వైస్​ చైర్​ పర్సన్​:  సుమన్​ కే బెరి(ఆర్థిక వేత్త)
శాశ్వత సభ్యులు :  వీకే సారస్వత్​ (శాస్త్రవేత్త), రమేశ్​ చంద్​ (వ్యవసాయ ఆర్థికవేత్త), వీకే పాల్​ (వైద్యుడు), అరవింద్​ విర్మనీ (స్థూల ఆర్థికవేత్త) 

ఎక్స్​అఫీషియో సభ్యులు :  కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, అమిత్​ షా, శివరాజ్​ సింగ్​ చౌహాన్​ (కొత్త ఎక్స్​ అఫీషియో సభ్యుడిగా చేరారు), నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి) 

ప్రత్యేక ఆహ్వానితులు : జేపీ నడ్డా (వైద్య ఆరోగ్యం), కింజరాపు రామ్మోహన్​ నాయుడు (పౌర విమానయానం), హెచ్​డీ కుమారస్వామి (ఉక్కు, భారీ పరిశ్రమలు), జితన్​రాం మాంఝీ (ఎంఎస్​ఎంఈ), రాజీవ్​ రాంజన్​ సింగ్​ (పంచాయతీరాజ్​, పశుసంవర్థకం), జూయెల్​ ఓరం (గిరిజన వ్యవహారాలు), అన్నపూర్ణాదేవి (మహిళా శిశు సంక్షేమం) చిరాగ్​ పాశ్వాన్​ (ఆహారశుద్ధి పరిశ్రమలు).

నీతి ఆయోగ్​ 64 ఏండ్లపాటు దేశానికి సేవలందించి కేంద్రంలో సూపర్​ కేబినెట్​గా పేరుగాంచిన ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్​(జాతీయ పరివర్తన సంస్థ)ను కేంద్రంలోని ఎన్​డీఏ ప్రభుత్వం 2015, జనవరి 1న ఏర్పాటు చేసింది. దీంతో ప్రణాళికా సంఘం రద్దయింది. ప్రపంచీకరణ నేపథ్యంలో మారిన ఆర్థిక పరిస్థితులు, కొత్త సాంకేతికతలు, మేధోసంపద వినియోగం, పాలనలో పారదర్శకత తదితర అంశాల ప్రాతిపదికన నీతి ఆయోగ్​ ఏర్పడింది.