గ్యాస్​ ధర పెంపుతో .. గ్రేటర్​పై రూ.7.50 కోట్ల భారం!

గ్యాస్​ ధర పెంపుతో .. గ్రేటర్​పై రూ.7.50 కోట్ల భారం!
  • ఒక్కో గ్యాస్ బండపై రూ.50 పెంచిన కేంద్రం 
  • సిటీ పరిధిలో 25 లక్షల గ్యాస్​కనెక్షన్లు  
  • ప్రతి నెలా15లక్షల సిలిండర్ల రీఫిల్లింగ్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: వంటగ్యాస్​ వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం భారం మోపింది. ఒక్కో సిలిండర్​ పై రూ.50 పెంచడంతో గ్రేటర్​పరిధిలోని దాదాపు 25లక్షల గ్యాస్​ వినియోగదారులపై నెలకు 7 కోట్ల 50 లక్షల అదనపు భారం పడనున్నది. ప్రస్తుతం ఒక్కో సిలిండర్​ధర రూ.855గా ఉంది. ఇక నుంచి 905 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిలిండర్ ధర 895 రూపాయలు ఉండగా, రూ.40 సబ్సిడీ ఇస్తూ రూ.855కి అందజేస్తున్నారు. పెంచిన రూ.50తో కలిపితే రూ.945 అవుతుంది. రూ.40 సబ్సిడీ పోనూ రూ.905 చెల్లించాల్సి ఉంటుంది.

డీబీటీ కిందకి మళ్లిస్తే.. 

ప్రస్తుతం గ్రేటర్​ పరిధిలో 25 లక్షల గ్యాస్​ కనెక్షన్లుండగా, ఇందులో దాదాపు 15 లక్షల మంది నెల నెలా సిలిండర్​రీఫిల్​చేసుకుంటున్నారు. దీంతో ఒక్కో కనెక్షన్ పై రూ.50 చొప్పున రూ.7.50 కోట్ల భారం పడనున్నది. ప్రభుత్వం పెంచిన భారాన్ని డీబీటీ కింద వినియోగదారులకు మళ్లిస్తే భారం పడదని, అలా కాకుండా అదే రూ.40 సబ్సిడీని కొనసాగిస్తే మాత్రం ఒక్కో వినియోగదారుడిపై రూ.50 భారం తప్పదని గ్రేటర్​హైదరాబాద్​గ్యాస్​డీలర్స్​అసోసియేషన్​అధ్యక్షుడు డి.అశోక్​కుమార్​చెప్పారు. సిలిండర్​పై రూ.50 పెంచడంపై నగరవాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.