- 200 కిలోల కొబ్బరిపొడి,2 లక్షల కల్తీ చాయ్ పత్తా సీజ్
కూకట్పల్లి, వెలుగు: నాసిరకమైన టీ పౌడర్‌లో ఎండు కొబ్బరి పొడి, కెమికల్స్ ను కలిపి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్ శివారులోని బాలానగర్ మండలం ఫతేనగర్ లో కల్తీ టీ పౌడర్ తయారు చేస్తున్న గోడౌన్ పై సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. రూ. 2 లక్షల విలువైన కల్తీ టీ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫతేనగర్‌లో ‘కోణార్క్టీ పౌడర్సేల్స్అండ్సప్లయిర్స్’ పేరుతో బిషోయ్జగన్నాథ్(32) టీ పౌడర్తయారీ సెంటర్నడుపుతున్నాడు. ఇతని వద్ద ప్రతాప్ప్రధాన్(21), శివ్స్వైన్పరిడా(19) వర్కర్లుగా పని చేస్తున్నారు.
ఇక్కడ నాసిరకమైన టీ పౌడర్‌లో ఎండు కొబ్బరి పౌడర్, రంగుల కెమికల్స్కలిపి కల్తీ టీ పౌడర్తయారు చేస్తున్నారు. దీన్ని స్థానికంగానే కాకుండా నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ ముఠా గురించి సమాచారం తెలుసుకున్న సెంట్రల్టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం సాయంత్రం గోడౌన్‌పై దాడి చేశారు. నిందితుల వద్ద నుంచి 300 కిలోల కల్తీ టీ పౌడర్, 200 కిలోల ఎండు కొబ్బరి పౌడర్, కెమికల్ కలర్స్, ప్యాకింగ్మెషీన్లు, ఫ్లేవర్ పౌడర్ల స్వాధీనం చేసుకున్నారు.