మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
  • జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ రజిని

వనపర్తి టౌన్, వెలుగు: మహిళలు తప్పనిసరిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ రజిని అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ ఎస్ బాయ్స్  స్కూల్ లో లైంగిక వేధింపుల చట్టం 2013 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తాము పనిచేసే కార్యాలయాల్లో, సంస్థలలో లైంగిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని ఇలాంటి సంఘటనలపై నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.   కార్యక్రమంలో జడ్పీహెచ్ ఎస్ బాయ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు టీచర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.