ఖమ్మం టౌన్, వెలుగు: నాగ్పూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అలైన్మెంట్ను మార్చాలని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం హైవే నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఖమ్మం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట భూ నిర్వాసిత జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.
హైవే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ ఆఫీస్ ఏఓ శైలజకు అందజేశారు. తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మాదిని రమేశ్, సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు, బాధిత రైతులు పాల్గొన్నారు.