కూటమికి చెక్ చెప్పేలా జగన్ ప్లాన్.. ప్రచార షెడ్యూల్లో మార్పు.. 

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఏపీలో రాజకీయ వేడి రెట్టింపవుతుంది. ఎన్నికలకు మరో 4రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అధికార ప్రతిపక్షాలు గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కూటమికి చెక్ చెప్పేలా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు 4రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో ప్రచార షెడ్యూల్ ని మార్చారు జగన్.

ఈ నెల 11న ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. దీంతో అన్ని పార్టీలకు రానున్న రెండు రోజులు ఎంతో కీలకమని చెప్పాలి. ఈ క్రమంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు వైసీపీ శ్రేణులు.ఈ సభ తర్వాత తాడికొండ, ప్రత్తిపాడులో కూడా ప్రచారానికి ప్లాన్ చేసారు . 11న పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జగన్ పర్యటించి వంగా గీత తరపున ప్రచారం చేయనున్నారు. ఇక అదే రోజు నగిరిలో కూడా ప్రచారం చేయనున్నారు జగన్. నగిరిలో సొంత పార్టీ నేతల నుండి అసమ్మతి ఎదుర్కుంటున్న రోజాకు జగన్ నిర్ణయం బలం చేకూర్చనుందని చెప్పాలి.