నలుగురితో దోస్తీ చేయాలంటే, పెదాలు దాటి మాటలు బాగుండాలి.. నాలుగు కాలాల పాటు బతికి ఉండాలంటే.. పెదవులు దాటి కడుపులోకి వెళ్లే ఆహారం బాగుండాలి. అంతెందుకూ... దొండపండు లాంటి పెదవి అని అమ్మాయిల పెదవులను కవులు అందంగా వర్ణిస్తారు. అయితే. పెదవులు ఎంతసేపూ అందాన్ని వర్ణించడానికినా? కాదు. పెదవులు చూసి ఆరోగ్యం ఎలా ఉందొ కూడా చెప్పొచ్చు.
అందమైన పెదాలు లేకుండా ముఖం అందాన్ని వర్ణించలేం. ఎదుటివారిని స్నేహానికి ఆహ్వానించాలన్నా ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించాలన్న పెదవులు చిలికే నవ్వే ఆధారం. నవ్వు ఒక మత్తు మందు తెలిసిన వారినే కాదు... తెలియని వారిని చూసి అప్యాయంగా నవ్వినా.. వారి పెదవులపై కూడా చిరునవ్వు పూస్తుంది. ఆ నవ్వుకు చిరునామా పెదవులు. ..అలాంటి పెదవులు ఆరోగ్యంగా అందంగా ఉందాలంటే ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. కానీ, మనిషి ఆరోగ్యాన్ని పెదవులు చెప్పేస్తాయని తెలుసా? అవును.. లిఫ్ స్టిక్ లాంటి రంగులేవి లేకుండా... పెదవుల రంగును చూసి ఎదుటివారి ఆరోగ్యాన్ని అంచనా చేయొచ్చంటున్నారు.
ఆరోగ్య నిపుణులు శరీరంలోని మార్పులను, ఆరోగ్య పరిస్థితులను కొన్ని శరీర భాగాలు అద్దంలో చూపిస్తాయి. అందులో కళు గోళ్లు, పెదవులు నాలుక బయటికి కనిపించేవి. ఆరోగ్యంలో మార్పులు పెదవుల రంగును మార్చేస్తాయి. ఆ రంగులను గమనించి సమస్య ఏమిటో... దాన్ని పరిష్కరించడానికి ఏం చేయాలో ఆలోచించవచ్చు. ఆ ఆరోగ్య సమస్య పోవడానికి ఏ రకమైన ఆహారాలను ఉపయోగించవచ్చో శరీరం గుర్తించగలదు. కాబట్టి అద్దంలో మొహం చూసుకున్నప్పుడు మీ పెడవుల రంగును గమనిస్తుండాలి.
గులాబీ రంగులో ఉంటే: పెదవులు సహజమైన గులాబీ రంగులో ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్య లేనట్లే. కాక పోతే ఆ రంగులో చిన్న చిన్న మార్పులు గమనిస్తే మాత్రం శరీరంలో ఏదోమార్చు మొదలైందనట్టే. పెదవులు గులాబీ నుంచి లేత గులాబీ రంగులోకి మారినప్పుడు అది రక్త హీనతను సూచిస్తుంది. శరీరంలో హిమో గ్లోబిన్, ఎర్రరక్తకణాలు తక్కువ ఉన్నట్లు. శరీరంలో ఈ పరిస్థితి ఉన్నప్పుడు పెదవులు మెల్లగా బ్లీచింగ్ కి గురై లేత గులాబీ రంగులోకి మారిపోతాయి. అప్పుడు అకుకూరలు, డ్రైఫ్రూట్స్, మాంసం, పండ్లు, ఐరన్, విటమిన్- సీ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినాలి
నల్లగా.. ముదురు ఎరుపు రంగులోకి మారితే..: కొంతమందికి పుట్టుకతోనే పెదాలు నల్లగా ఉంటాయి. కొంతమందికేమా పొగతాగడం వల్ల పెదవులు నలుపు రంగులోకి మారతాయి. అయితే పెదవులు బాగా నల్లగా మారినా, ముదురు ఎరుపు రంగులోకి మారినా .... మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గమనించాలి. ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు ముందుగా జాగ్రత్త పడితే దీర్ఘకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ముందే చెక్ పెట్టొచ్చు. ప్రొసెస్డ్ ఫుడ్, బేకింగ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఎక్కువగా ఫైబర్ కంటెంట్ దొరికే పుడ్కే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆకుకూరలు, చిక్కుడుజాతి కూరలు, యాపిల్స్, అరటిపండు, నారింజ, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి
ఊదా రంగులోకి మారితే.. చలికాలం వచ్చిందంటే.. ఎంతటి ఆరోగ్యవంతుల పెదవులైనా పొడిబారాల్సిందే.. అయితే... సీజన్ తో సంబంధం లేకుండా పెదవుల చుట్టూ కొందరికి నీలిరంగులో, కొందరికి ఊదా రంగులో వలయాలు వస్తాయి. ఇది శ్వాసకోశ, గుండె సమస్యలను సూచిస్తుంది. శరీరంలో రక్తం సరిగ్గా సరఫరా కాకపోతే కూడా ఇలాంటి సంకేతాలు వస్తాయి. కాబట్టి మీ పెదవులు ఈ రంగులోకి వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం బెటర్.
ఎర్రగా మారితే: కొందరి పెదవులు సహజంగానే ఎర్రగా ఉంటాయి. సహజ ఎరుపు, పర్వాలేదు కానీ, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎర్రగా ఉంటే.. అరోగ్య సమస్య ఉన్నదని గ్రహించాలి. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నా, చెడు శ్వాసలో ఇబ్బంది పడుతున్నా పెదవులు ఎర్రగా మారతాయి. కాలేయ పనితీరు మందగించినా, ఫుడ్ అలర్జీ, లిక్విడ్ అలర్జీ వల్ల కూడా పెదవులు రంగు పడతాయి. ఈ సమస్యతో బాధపడేవారు టీ తక్కువగా తాగాలి, తేనె ఎక్కువగా తీసుకుంటే పెదాల రంగులో మార్పు కనిపిస్తుంది. ఒత్తిడి తగ్గిలా వ్యాయామం చేయాలి..
–వెలుగు, లైఫ్–