బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కు మార్పులు చేసిన బీసీసీఐ

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కు మార్పులు చేసిన బీసీసీఐ

బంగ్లాదేశ్ తో భారత్ కు డిసెంబర్ 14 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.  అయితే  లేటెస్ట్ గా  టెస్ట్ సిరీస్ లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసినట్లు ప్రకటించింది. గాయంతో  దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడని.. అతడి స్థానంలో  అభిమన్యు ఈశ్వరన్  ను తీసుకున్నామని తెలిపింది. కేఎల్ రాహుల్ టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్సీ చేస్తాడని  చెప్పింది. అలాగే గాయాలతో షమీ, జడేజా టెస్టుల నుంచి దూరమయ్యారని.. వాళ్ళ స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ ను ఎంపిక చేసినట్లు తెలిపింది. బంగ్లాతో ఫస్ట్ టెస్టు 14 నుంచి 18 వరకు, సెకండ్ టెస్టు 22 నుంచి 26 వరకు జరగనుంది. ఇప్పటికే జరిగిన మూడు వన్డేల సిరీస్ ను బంగ్లా సొంతం చేసుకుంది



బంగ్లాతో  జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండా  రోహిత్ శర్మ చేతికి  గాయమైన సంగతి తెలిసిందే. అదే గాయంతో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు  వచ్చిన రోహిత్.. 28 బంతుల్లో 51 బంతులు చేసి అందరి మనసులు గెలిచాడు.ఈ మ్యాచ్ లో భారత్ ఓడినా..రోహిత్ బ్యాటింగ్ అందరినీ ఆకట్టుకుంది.