సిద్దిపేట, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామిని సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ సాకి ఆనంద్ సన్మానించారు. శనివారం సిరిసిల్లలో వివిధ కార్యక్రమాల్లో హాజరవడానికి వెళ్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని రంగధాంపల్లి చౌరస్తా వద్ద సాకి ఆనంద్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా స్థానిక రాజకీయాల గురించి ఆరా తీసి సిద్దిపేటలో కాంగ్రెస్ బలోపేతం చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట మాల కుల సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.