ధర్మారం,వెలుగు: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పలు బాధిత కుటుంబాలను చెన్నూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి శనివారం పరామర్శించారు. ధర్మారం ఏఎంసీ చైర్మన్ లావుడ్య రూప్లా నాయక్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో చనిపోగా బంజేరుపల్లిలోని వారి ఇంటికి వెళ్లి ఓదార్చారు. అనంతరం మండల కేంద్రంలోని జర్నలిస్ట్ దేవి రాజమల్లయ్య చిన్న కొడుకు దేవి సిద్దార్థ్ ప్రమాదంలో గాయపడగా వారి ఇంటికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.
ఆయన వెంట ధర్మారం బ్లాక్ 2 కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, లీడర్లు కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశంగౌడ్, దేవి జనార్ధన్, మార్కెట్ డైరెక్టర్లు కాంపెళ్లి రాజేశం, మహిపాల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి, చిరంజీవి, హఫీజ్, దేవి అకిల్, పొన్నం కృష్ణ, స్వామి, ఎండీ అష్షు, దేవి రాజలింగయ్య పాల్గొన్నారు.