గోదావరిఖని రేణుక ఎల్లమ్మ గుడిని సందర్శించిన చెన్నూర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే

గోదావరిఖని రేణుక ఎల్లమ్మ గుడిని సందర్శించిన చెన్నూర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో త్వరలో ప్రారంభం కానున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఏప్రిల్‌‌‌‌ 2, 3, 4 తేదీలలో విగ్రహ ప్రతిస్థాపన జరగనుండగా, గౌడ సంఘం నాయకులు వివేక్​ వెంకటస్వామికి ఆహ్వానపత్రికను అందజేశారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమంలో వివేక్​ వెంకటస్వామి పాల్గొని పూజలు చేశారు. ఎన్టీపీసీలో ఐఎన్‌‌‌‌టీయూసీ లీడర్​బాబర్​ సలీంపాషను కలిసి రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో గౌడ సంఘం లీడర్లు మెరుగు హనుమంతుగౌడ్, బాలసాని స్వామిగౌడ్, లక్ష్మిపతిగౌడ్,  శ్రీనివాస్​ గౌడ్, తిరుపతి గౌడ్​, నాగభూషణం గౌడ్, ఆంజనేయులు గౌడ్, గోవర్ధన్​రెడ్డి, కోటేశ్వర్లు, మధు, తదితరులు పాల్గొన్నారు. 

రంజాన్​విందులో వివేక్​ వెంకటస్వామి

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్​కాంగ్రెస్​ లీడర్​ సయ్యద్ సజ్జాద్​ స్వగృహంలో  సోమవారం ఏర్పాటు చేసిన రంజాన్​విందులో చెన్నూర్​ఎమ్మెల్యే డాక్టర్​ గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు బండారి సునీల్, బాలసాని సతీశ్‌‌‌‌, గంగుల సంతోష్, ప్రశాంత్‌‌‌‌, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.