సెబీ ఛైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అదానీనీ మోదీ అన్ని రకాలుగా కాపాడుతున్నారని విమర్శించారు. అదానీ కంపెనీతో సెబీ ఛైర్మన్ కు లావాదేవీలు జరిగాయని చెప్పారు. సెబీ ఛైర్మన్ ను సస్పెండ్ చేయాలన్నారు ఎమ్మెల్యే వివేక్.
అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రతిపక్షాలపై ఈడీతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు వివేక్ .అదానీపై చర్యలు తీసుకోవాలన్నారు. పెట్టుబడుల పేరుతో సంపదను దోచిపెడుతున్నారని వివేక్ అన్నారు. వాస్తవాలు బయటకు రావాలంటే జేపీసీ వేయాలన్నారు.
అదానీ మెగా కుంభకోణంపై విచారణకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు కాంగ్రెస్ నేతలు. మంత్రులు తుమ్మల, పొన్నం, ఎంపీలు మల్లు రవి, పెద్దపల్లి ఎంపీ గడ్డంవంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, దానం, జయవీర్ రెడ్డి, ఆందోళనలో పాల్గొన్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణకు JPC కమిటీ వేయాలని నినాదాలు చేశారు.