నా తండ్రి కాకా విజన్తోనే ఈ స్థాయిలో ఉన్నా: ఎమ్మెల్యే వివేక్

 నా తండ్రి కాకా విజన్తోనే ఈ స్థాయిలో ఉన్నా: ఎమ్మెల్యే వివేక్

తన తండ్రి వెంకటస్వామి  క్రమశిక్షణ , సమాజం పట్ల ఆయనకు ఉన్న విజన్  తోనే  తాను వ్యాపారవేత్తగా , పొలిటీషియన్ గా రాణిస్తున్నానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి అన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను సంపాదించిన దానిలో కొంత మేర విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

దళితుల అభ్యున్నతి కోసం తాను ఎప్పుడు ముందుంటానని వివేక్ వెంకటస్వామి అన్నారు.  గతంలో రైతుబంధు విషయంలో కౌలు రైతులకు వర్తింపజేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కొట్లాడినట్లు చెప్పారు.  దళితులకు భూమి ఉండదు కాబట్టి వారికి ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిపారు. ఈ విషయంలోనే తనకు కేసీఆర్ కు  గ్యాప్ వచ్చిందని గుర్తు చేశారు. దళితులు ఏ రంగంలో ఉన్నా..  వాళ్లు అభివృద్ధి చెందేందుకు తాను చేయూత అందిస్తానని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.  
 
పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ 5వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్ లోని ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య , ఏపీ చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావు , ఐపీఎస్ అధికారిణి చేతన, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా   వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్దులకు ట్రస్ట్ ఛైర్మెన్ బాలకృష్ణ ఎన్నో కార్యక్రమాలు  చేపడుతున్నారని కొనియాడారు. ఇలాంటి స్వచ్చంద సంస్థలు ముందుకు రావడం వల్ల ఎంతో మంది నిరుపేద విద్యార్థులు వృద్ధిలోకి వస్తారన్నారు.