ఇంగ్లాండ్ సిరీసే లక్ష్యంగా: సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన పుజారా

ఇంగ్లాండ్ సిరీసే లక్ష్యంగా: సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన పుజారా

వెటరన్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా టీమిండియాలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఫామ్ లేమితో భారత క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయిన ఈ సౌరాష్ట్ర బ్యాటర్ రంజీల్లో సత్తా చాటాడు. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అజేయ సెంచరీతో మెరిశాడు. 162 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న పుజారా.. రెండో రోజు ఆటముగిసే సమయానికి 239 బంతుల్లో 19 ఫోర్లతో 157 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఓపెనర్ స్నెల్ పటేల్ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన నయా వాల్ జార్ఖండ్ బౌలర్లను అలవోకగా ఆడేశాడు. ఈ సెంచరీతో  పుజారా తన 61వ ఫస్ట్‌క్లాస్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. పుజారాతో పాటు హర్విక్ దేశాయ్(85), షెల్డన్ జాక్సన్(54), వాసవాడ(68) రాణించడంతో రెండో రోజు ఆట ముగిసేసరికి సౌరాష్ట్ర 4 వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఝార్ఖండ్ 142 పరుగులకే ఆలౌట్ కావడంతో ప్రస్తుతం సౌరాష్ట్ర 264 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.      

పుజారా చివరిసారిగా భారత్ తరపున 2023 లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో 14, 27 పరుగులు చేసి నిరాశపరించిన ఏ వెటరన్ బ్యాటర్ కు ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్ టూర్ కు గట్టి షాకిచ్చారు. పూజారాపై వేటు వేసి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. ఇటీవలే సౌతాఫ్రికా టూర్ కు సైతం పుజారాకు సెలక్టర్లు పట్టించుకోలేదు. దీంతో ఇక పుజారా టెస్ట్ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ తాజాగా సెంచరీ చేయడంతో మల్లి రేస్ లోకి వచ్చాడు. సౌతాఫ్రికా టూర్ లో కుర్రాళ్ళు విఫలం కావడంతో పుజారాకు ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది.