భారత్‌‌లో విచిత్ర గ్రామం.. అక్కడ పెళ్లికి ముందే....

భారత్‌‌లో విచిత్ర గ్రామం.. అక్కడ పెళ్లికి ముందే....

ప్రపంచ దేశాల్లో అనేక రకాల సంప్రదాయాలూ, ఆచారాలూ ఉన్నాయి. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ విశిష్ట సంప్రదాయాలు ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి. పెళ్లికి ముందు శారీరక సంబంధాలు అవసరమయ్యే గ్రామం భారతదేశంలో ఉంది. ఎందుకో తెలుసుకుందాం.

 ఇండియాలో ముద్దు, ముచ్చట ఏదైనా పెళ్లి తర్వాతే అంటారు. ఇది అందరి ఆమోదం పొందిన మంచి సంప్రదాయం. అలాంటి మన భారత్‌లో ఓ గ్రామంలో మాత్రం పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకోవాలి. చిత్రంగా ఉన్న ఆ సంప్రదాయం సంగతేంటో చూద్దాం. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని మురియాతెగలో ఈ ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఇక్కడి ప్రజలు ఏళ్ల తరబడి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పెళ్లికి ముందు కలిసి జీవిస్తారు. కలిసి మంచి సమయం గడుపుతారు. ఇదో రకమైన డేటింగ్ అంటారు కొందరు.

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావింత ప్రాంతమైన బస్తర్ జిల్లాల్లో గోండు, మురియా తెగకు చెందిన గిరిజనులు నివసిస్తారు. వీరి ఆచారాల సంప్రదాయలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఇవి భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. సాధారణంగా మన దేశంలో వివాహానికి స్త్రీ .. పురుషుల కలయిక  గురించి బహిరంగ మాట్లాడం పెద్ద తప్పుగా చూస్తారు. కానీ ఈ గిరిజన తెగల్లో మాత్రం ఇది సర్వసాధారణం.  కలిసి తిరగడం.. శారీరకంగా కలవడం .. అందరికీ తెలిసే జరుగుతాయి.

మురియా తెగలో సభ్యులు తమ విశిష్ట సంప్రదాయాన్ని గౌరవిస్తారు. దాన్ని కాపాడుకోవడానికి యువతను ప్రోత్సహిస్తారు. ఆ తెగలో అబ్బాయికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లిదండ్రులు అతన్ని ఘోతుల్‌కు పంపిస్తారు. ఘోతుల్ అనేది యువతులతో కలిసి సమయాన్ని గడపడానికి రూపొందించిన నివాస స్థలం. ఘోతుల్‌కి వెళ్లిన యువతీ, యువకులు తమ ఇష్టం వచ్చినట్లు జీవించే సంప్రదాయం అది. అక్కడ యువతీ యువకులు వివాహానికి ముందే ఒకరితో ఒకరు శారీరక సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ అబ్బాయిలూ, అమ్మాయిలూ ఎలాంటి సామాజిక ఒత్తిడీ లేకుండా తమ భాగస్వామిని ఎంచుకోవచ్చు. పెళ్లికి ముందు వరకూ ఎంతమందినైనా భాగస్వాములను మార్చుకోవచ్చని తెలుస్తోంది.

బస్తర్ జిల్లాలో ఇంద్రావతి నదికి ఉత్తరాన మురియా తెగలు నివసిస్తున్నాయి. . బస్తర్ నక్సలిజం ఉన్న ప్రదేశంగా కూడా ఉంది. ఈ తెగలు శతాబ్ధాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. సుమారు 20 వేల నుండి 25 వేల వరకూ వీరి జనాభా ఉంటుంది.  ఈ గిరిజనల తెగలు ఘోతుల్ అనే సంప్రదాయాన్ని పాటిస్తారు. ఘోతుల్ అంటే పెద్ద పెద్ద వెదురు బొంగులతో ఇంటిని నిర్మిస్తారు. ఇవి పట్టణ ప్రాంతాల్లో ఉండే నైట్ క్లబ్‌ల్లా ఉంటాయన్నమాట. యువతీ యువకులు ఒకరినొకరు తెలుసుకుని సరదాగా గడపడానికి ఇక్కడికి వస్తుంటారు. 10 ఏళ్లు నిండిన పిల్లలు ఎవరైనా ఘోతుల్‌కు వెళ్లవచ్చు. అప్పటి నుంచే తల్లిదండ్రులు వారిని ఘోతుల్‌కు పంపడం ప్రారంభిస్తారు. ఘోతుల్‌లోకి వెళ్లి ఏదైనా చేసే స్వేచ్ఛ వారికి ఉంటుంది. అక్కడ యువతీ యువకులు వివాహానికి ముందే ఒకరితో ఒకరు సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు.  కోరుకున్నంత మందితో సంబంధం పెట్టుకోవచ్చు. ఇక్కడ యువతీ యువకులకు ఎలాంటి సామాజిక ఒత్తిడి లేకుండా తమ భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది.

 యువకులు తమకు నచ్చిన యువతి కోసం ప్రత్యేకంగా వెదురు బొంగుతో తయారుచేసిన దువ్వెనలను ఇస్తుంటారు. ఆ దువ్వెనలు ఆమె తలలో ఉంచుతారు. ఒకవేళ ఆ యువతి దానిని ఇష్టపడితే.. అలాగే జట్టులో ఉంచుకుంది. లేదంటే తీసేస్తుంది. దువ్వెనను జుట్టులో ఉంచుకుంటే.. ఆ యువతి ఆ యువకుడిని ఇష్టపడుతుందని అర్ధం. అప్పుడు వారిద్దరు కలిసి జీవించవచ్చు. ఒకరితో మరొకరు శారీరక సంబంధం ఏర్పరచుకోవచ్చు.  వారు ఏడు రోజుల పాటు కలిసి ఉంటారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు సంపూర్ణంగా ఇష్టపడితే వివాహం చేసుకోవచ్చు. ఈ వేడుకను ముగించడానికి అబ్బాయి అమ్మాయి తలలో ఒక పువ్వును పెట్టాల్సి ఉంటుంది. అమ్మాయి అంగీకారంతో అబ్బాయి అలా చేస్తే వారు వివాహం చేసుకుంటారని అర్ధం. లేకపోతే వారు తమ తదుపరి భాగస్వామికోసం అన్వేషణ ప్రారంభిస్తారు, 

మురియా తెగకు చెందిన యువత ఇప్పుడు  ఉన్నత చదువుల కోసం పట్టణాలకు, నగరాలకు వెళుతున్నారు. కొందరు ఉద్యోగాలు సంపాదించి వివిధ ప్రాంతాల్లో కూడా స్థిరపడుతున్నారు.  మరికొందరు మాత్రం నియమాలకు కట్టుబడి ఉంటున్నామని, పిల్లలు 10 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి వారిని విద్య కోసం ఘోతుల్‌ కు పంపించాల్సి ఉంటుందని, దీనిని అనుసరించకపోతే సమాజం నుండి బహిష్కరించబడే ప్రమాదం ఉంటుందని చెబుతుంటారు. ఏదేమైనా భవిష్యత్తులో ఈ పద్ధతిలో మార్పు వస్తుందని బయట స్థిరపడిన మురియా యువత అభిప్రాయపడుతున్నారు.