Viral Video: పేరెంట్స్​ పిల్లలను పట్టించుకోకపోతే ఎలా... క్షణం ఆలస్యమైతే పిల్లాడి ప్రాణాలు పోయేవి..

చేతిలో ఫోన్​ఉంటే చాలు.. ఏం జరుగుతున్నా జనాలు పట్టించుకోవడం లేదు.  ఎక్కడ ఉన్నా సరే మొబైల్​ లో ఉండి.. కనీసం పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు.  సరి ఇదంతా ఇంట్లోనే.. మన బజార్​ లోనే అయితే సరిపోతుంది.  అదే బాగా రద్దీగా ఉండే ప్రదేశాలైతే పిల్లలను పట్టించుకోకపోతే అనర్ధాలు చవి చూడాల్సి వస్తుంది.   తాజాగా చిలీలోని శాంటియాగో  అంతర్జాతీయ విమానశ్రయంలో ఓ షాకింగ్​ ఘటన జరిగింది.   వివరాల్లోకి వెళ్తే...

విమానాశ్రయాలు సహజంగా రద్దీగా ఉంటాయి.  ప్లాట్​ ఫామ్స్​ పైకి వచ్చి పోయే జనాలతో జనాలు రద్దీగా ఉంటారు.  గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారు  విమానం ఎక్కేందుకు వస్తుంటారు.  అలాగే ఓ దంపతులు మూడేళ్ల చిన్నారితో  శాంటియాగో  అంతర్జాతీయ విమానశ్రయానికి వచ్చారు.  పిల్లాడిని పట్టించుకోకుండా.. వారు తమ ఫోన్లలో బిజీగా ఉన్నారు.  ఆ సమయంలో ఆ అల్లురి పిల్లాడు  చేసిన ఘటన సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది.  ఎయిర్​ పోర్ట్​ సిబ్బంది స్పందించడంలో కాస్త ఆలస్యమైతే పిల్లాడి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేది.. ఇంతకూ అసలేం జరిగింటే....

 ఎయిర్​ పోర్టులో ఆడుకుంటున్న బాలుడు బ్యాగేజీ కన్వేయర్ పైకి ఎక్కి కూర్చున్నాడు. ఈ విషయాన్ని తల్లి దండ్రులు గమనించలేదు.  వారు ప్రయాణం చేయాల్సిన విమానం వస్తుందని తెలిసిన వెంటనే పిల్లాడికోసం వెతకడం ప్రారంభించారు. అప్పటికే కన్వేయర్​పై చాలా దూరం వెళ్లిన పిల్లాడిని గమనించలేదు.  ఎయిర్​ పోర్టు సిబ్బందికి తమ చిన్నారి కనపడటం లేదని చెప్పగా  ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులు కూడా వెతకుతుండగా కదులుతున్న  కన్వేయర్ బెల్ట్‌లో అబ్బాయి కనిపించాడు. 

అయితే అక్కడి పరిస్థితిని బట్టి చూస్తే నిమిషాల వ్యవధిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఈ సమయంలో విమానాశ్రయ ఉద్యోగులు అన్ని కన్వేయర్ రోలర్లను దాటి పిల్లాడి ప్రాణాలను కాపాడారు. ఏమాత్రం ఆలస్యమైనా బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్టు చేయడంతో నెటిజన్లు స్పందించారు,   క్షణం ఆలస్యమైతే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అని కొందరు అంటుండగా.. తల్లిదండ్రులు, మీరు దీనిని చూసినవారు, అప్రమత్తంగా ఉండండి అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు...