సీఎం, మంత్రి సీతక్కను కలిసిన బాలల హక్కుల కమిషన్ మెంబర్స్

సీఎం, మంత్రి సీతక్కను కలిసిన  బాలల హక్కుల కమిషన్ మెంబర్స్
  • స్టాఫ్ ను కేటాయించాలని మంత్రికి వినతి

హైదరాబాద్, వెలుగు: బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి, మెంబర్స్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి సీతక్కను బేగంపేటలోని ప్రజాభవన్ లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు. 

కమిషన్ కు స్టాఫ్ ను కేటాయించాలని చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి మంత్రిని కోరారు. ప్రస్తుతం ఉన్న స్టాఫ్ కూడా డిప్యూటేషన్ మీద పని చేస్తున్నారని తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం పని చేయాలని, కమిషన్ పనితీరు బాగుండాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు.