మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది చిన్నపిల్లలను తారుమారు చేశారు. సుమిత్రకు పుట్టిన బాబును సునిత అనే మహిళకు అప్పగించారు. ఈ విషయాన్ని సుమిత్ర కుటుంబ సభ్యులు గంట తర్వాత గుర్తించి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
జరిగిన తప్పును తెలుసుకున్న వైద్య సిబ్బంది సునీత దగ్గరి నుంచి బాబును తీసుకొని సుమిత్రకు అప్పగించారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. పిల్లలతారుమారుతో వార్డులో ఉన్న చిన్న పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.