
ఇటీవలి కాలంలో బార్డర్ లవ్ స్టోరీలో ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. మొన్నటికి మొన్న పబ్ జీలో పరిచయమైన ఇండియన్ లవర్ కోసం ఓ పాక్ మహిళ భారత్ లో అక్రమంలో ప్రవేశించింది. నిన్న ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల వివాహిత అంజు పాకిస్థాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు చైనాకు చెందిన ఓ యువతి స్నాప్‌చాట్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లింది. అంతే కాదు 3 నెలల వీసా తీసుకుని మరి సదరు యువతి పాక్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ అత్యంత ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే.. మూడు ఘటనల్లోనూ మహిళలే దేశ సరిహద్దులు దాటారు. అలాగే మూడు ఘటనల్లోనూ వయసుల పరంగా ప్రియుడి కంటే ప్రియురాళ్లే పెద్ద వారు. మరో విషయమేమిటంటే.. మూడింటిలోనూ కామన్ గా వినిపిస్తోన్ పేరు పాకిస్థానే కావడం చర్చనీయాంశంగా మారింది.
AsloRead:హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఆర్టీసీ బస్సులు బంద్
ఒక చైనా మహిళ సోషల్ మీడియాలో స్నేహం చేసి ప్రేమలో పడిన పాకిస్థానీ వ్యక్తిని కలవడానికి ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ మహిళ పేరు గావో ఫెంగ్ అని.. మూడు నెలల విజిట్ వీసాతో చైనా నుంచి పాకిస్థాన్ కు.. ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని గిల్గిట్ మీదుగా జూలై 26న రోడ్డు మార్గంలో ఇస్లామాబాద్‌కు చేరుకుంది. 21 ఏళ్ల ఆమెను ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని బజౌర్ గిరిజన జిల్లా నివాసి అయిన 18 ఏళ్ల స్నేహితుడు జావేద్ తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న బజౌర్ జిల్లాలో భద్రతా పరిస్థితుల కారణంగా జావేద్ తన స్వగ్రామానికి బదులుగా లోయర్ దిర్ జిల్లాలోని సమర్‌బాగ్ తహసీల్‌లోని తన మామ ఇంటికి మహిళను తీసుకెళ్లాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరూ మూడేళ్ల క్రితం స్నాప్‌చాట్ ద్వారా పరిచయమయ్యారు. రోజులు గడిచే కొద్దీ వారిద్దరి మధ్య ఉన్నస్నేహం కాస్తా ప్రేమగా మారింది. లోయర్ దిర్ జిల్లా జిల్లా పోలీసు అధికారి జియావుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. చైనా మహిళకు సమర్‌బాగ్ ప్రాంతంలో పూర్తి భద్రత కల్పించామని తెలిపారు. మహిళ ప్రయాణ పత్రాలు అన్నీ సక్రమంగానే ఉన్నాయని, ఆమె ఇంకా జావేద్‌తో 'పెళ్లి' చేసుకోలేదని పోలీసులు తెలిపారు.