క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.95 కోట్లు కొట్టేశాడు

  • నిందితుడు రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేసిన సీఐడీ
  • జీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రిప్టో పేరుతో ఫేక్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రియేట్ 
  • ఇన్వెస్ట్​మెంట్ పేరుతో 43 మంది నుంచి 95 కోట్లు వసూలు

హైదరాబాద్, వెలుగు: క్రిప్టో కరెన్సీ పేరుతో ఇన్వెస్టిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోసాలకు పాల్పడుతున్న జనగాం జిల్లా లింగాల ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం నెల్లుట్లకు చెందిన కురిమెల రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(47)ను సీఐడీ పోలీసులు గురువారం శుక్రవారం అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. వివరాలను సీఐడీ డీజీ శిఖాగోయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్రవారం వెల్లడించారు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో జీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రిప్టో పేరుతో నకిలీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూపుల్లో సర్క్యులేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

జీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించాడు. ఈ క్రమంలోనే కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అర్ర మనోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడులు పెట్టాడు. మనోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా మరో 43 మంది బాధితులు ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇలా రమేశ్ గౌడ్​మొత్తం రూ.95 కోట్లు వసూలు చేశాడు. మోసపోయామని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడు రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్​ను అరెస్ట్ చేసిన రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.