న్యూఢిల్లీ: క్రెడిట్ క్లెయిమ్స్‌కు సంబంధించి జీఎస్టీ అథారిటీ తమకు రూ.కోటి పెనాల్టీ విధించిందని ఫార్మా కంపెనీ సిప్లా శుక్రవారం వెల్లడించింది. మొత్తం రూ.1.11 కోట్లు చెల్లించాలంటూ కంపెనీకి అథారిటీ ఈ నెల 18న ఆర్డర్ జారీ చేసింది. సెంట్రల్ గూడ్స్ అండ్సర్వీసెస్ చట్టం 2017 ప్రకారం ఈ పెనాల్టీ విధించింది. కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రాన్–1 క్రెడిట్‌ను పొందిందని అథారిటీ పేర్కొంది.
ఈ మొత్తాన్ని వడ్డీ, పెనాల్టీతో సహా చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే ఇలా పెనాల్టీ విధించడం ఏకపక్షమని, అన్యాయమని సిప్లా వాదించింది. దీనిపై అప్పీలుకు వెళ్తామని స్పష్టం చేసింది.