జాతరలొ రికార్డింగ్ డ్యాన్సులు: యువకులపై దాడి.. ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా: చిలుకూరు మండలం బేతవోలు కనకదుర్గమ్మ జాతరలొ ఘర్షణ జరిగింది. జాతర సందర్భంగా పార్టీల నేతలు ప్రభలు, రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. యువతులు ఆశ్లీల ప్రదర్శనలు చేస్తుండగా స్థానిక యువకులు కొందరు స్టేజీపైకి ఎక్కారు. యువతులతో కలిసి డ్యాన్స్ చేశారు.దీంతో యువకులకు, నిర్వహకులకు మధ్య గొడవ జరిగింది. యువకులపై నిర్వహకులు దాడి చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.