ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు.కేజ్రీవాల్ బెయిల్ ను నిలుపుదల చేస్తూ తాము ఇచ్చిన ఉత్తర్వులు కొన సాగుతాయని ఢిల్లీ హైకోర్టు మంగళవారం( జూన్ 25, 2024) స్పష్టం చేసింది.
ఇటీవల కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ ను నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇరుపక్షాలను లిఖితపూ ర్వంగా వాదనలు సమర్పించాలని ఈడీ, కేజ్రీవాల్ ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈడీ, కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలను సోమవా రం (జూన్ 24) కోర్టు సమర్పించారు. ఆ వాదలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ నిలుపుదల ఉత్తర్వులు కొనసాగుతాయని ఇవాళ తీర్పునిచ్చింది.
అయితే ఇదివరకే తన బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు నిలుపుదలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు వరకు తాము వేచి చూస్తామని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ... రేపు (జూన్ 26) సుప్రీంకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుం టుందనేది చర్చనీయాంశంంగా మారింది.