సీఎం కేసీఆర్ కాన్వాయ్లోకి కోటి 30 లక్షల కొత్త కారు

సీఎం కేసీఆర్ కాన్వాయ్లోకి మరో కారు వచ్చి చేరింది. కొత్తగా ల్యాండ్ క్రూజర్ కాన్వాయ్ లో కనిపించనుంది. కొత్త ల్యాండ్ క్రూజర్ కారుకు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ నుండి యాదాద్రి ఆలయానికి ఎస్కార్ట్ తో వచ్చిన సీఎం కేసీఆర్ కాన్వాయ్ కొత్త కారుకు కొండపై ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో ఎన్నికార్లు

ప్రస్తుతం సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో 15 కార్లు, ఒక అంబులెన్స్ ఉంది. తాజాగా ల్యాండ్ క్రూజర్ రావడంతో కాన్వాయ్ లోని కార్ల సంఖ్య 16కు చేరింది. ల్యాండ్ క్రూజ‌ర్ ప్రాడో వాహ‌నం ఖ‌రీదు రూ.కోటి 30లక్షలు కావడం విశేషం.