
గద్వాల, వెలుగు : గద్వాలలో సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ మీటింగ్ కు వస్తే డబ్బులు ఇస్తామంటూ గుడి మైకుల ద్వారా బీఆర్ఎస్ లీడర్లు అనౌన్స్ చేయించడం చర్చనీయాంశమైంది. మీటింగ్ వచ్చిన ప్రతీ మనిషికి రూ. 300 ఇవ్వడంతో పాటు, మీటింగ్ వద్దే భోజనం పెడుతామంటూ అనౌన్స్ చేయించారు.
టూ వీలర్ పై వచ్చిన వారికి పెట్రోల్ కోసం రూ. 100 అదనంగా ఇస్తామంటూ ఆదివారం సాయంత్రం, సోమవారం ఉదయం ప్రకటించారు. భక్తి గీతాలు వినిపించాల్సిన గుడి మైకుల్లో ఇలా అనౌన్స్ చేయించడం ఏంటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.