సూర్యాపేట బాగుపడాలంటే కాంగ్రెస్‌ను గంగలో పారేయాలి : కేసీఆర్​

  •     డబ్బు మదంతో పండవెట్టి తొక్కుతాం అనేటోళ్లు ఎమ్మెల్యేలు కావాల్నా?
  •     మంత్రి జగదీశ్​ రెడ్డి చేసిన మంచి పనుల్లో ఒక్కటైనా కాంగ్రెసోళ్లు చేసిన్రా? 
  •     మూసీ మురికినీళ్లు, ఫ్లోరైడ్​ నీళ్లు తాగించిన చరిత్ర వాళ్లది
  •     జగదీశ్​ రెడ్డిని మళ్లీ గెలిపిస్తే ఉన్నత స్థానంలో ఉంటడు
  •     డ్రైపోర్ట్​తో సహా ఆయన కోరిన హామీలన్నీ నెరవేరుస్తా : సీఎం కేసీఆర్


నల్గొండ / సూర్యాపేట వెలుగు : సూర్యాపేట  బాగుపడాలంటే ఉమ్మడి జిల్లాకు పట్టిన కాంగ్రెస్​ దరిద్రాన్ని గంగలో పారేయాలని సీఎం కేసీఆర్​ పిలుపునిచ్చారు. మంగళవారం సూ ర్యాపేటలో జరిగిన ప్రజాఆశ్వీరాధ సభలో ఆయన మాట్లాడారు. ఈ జిల్లా లో కొంత‌మంది కాంగ్రెస్ నాయ‌కులు  అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  

‘మేం గెలిస్తే మిమ్మల్ని రోడ్డు మీద పండ‌వెట్టి తొక్కుతాం’ అని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అంటున్నాడని నిన్న నకిరేకల్​మీటింగ్‌లో చెప్పారని గుర్తు చేశారు.   డబ్బు కట్టల మదంతో మాట్లాడుతున్న నా యకులను కోట్లు విలువ చేసే మీ ఓటుతో కింద పడగొట్టాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా అంతటా ఈ విప్లవ చైతన్యం రావాలని, 12 స్థా నాల్లో బీఆర్ఎస్​ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

ఈ దుర్మార్గుల ఆగడాలు ఇంకెన్నాళ్లు? 

‘ఇది ఎర్రజెండాలు ఎగిరిన గడ్డ.. క‌మ్యూనిస్టు ఉద్యమాలు న‌డిచిన నేల.. భీంరెడ్డి న‌ర్సింహారెడ్డి లాంటి మ‌హానీయులు ప‌ని చేసిన  ఈ గ‌డ్డ మీద ఈ దుర్మార్గుల ఆగ‌డాలు ఏంది..?  ఎంత‌కాలం వీళ్ల రాజ్యం సాగుత‌ది..?’ అని కేసీఆర్‌‌ ప్రశ్నించారు.  గత 50 ఏళ్ల నుంచి హైదరాబాద్​ మురికాల కాలువల్లో పారుతున్న నీటిని సూర్యాపేట ప్రజలకు తాగించారని, మునుగోడు, దేవరకొండలో ఫ్లోరైడ్​ నీళ్లను తాగించి లక్షా 50వేల మంది బతుకులను ఆగం చేశారని మండిపడ్డారు. 

తన కంటే దొడ్డుగా, ఎత్తుగా ఉన్న వీళ్లకు  కనీసం మంచినీళ్లు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదని నిలదీశారు.  మంచినీళ్లు కూడా ఇయ్యడం చేత‌కాని కాంగ్రెస్ నాయ‌కులు అడ్డం పొడ‌వు  మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. ఇవాళ పాలేరు నుంచి పాలలాంటి నీళ్లు వస్తున్నాయని, నాగార్జున సాగ‌ర్ కింద టేయిల్ పాండ్ నుంచి మంచినీళ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. 

ఈ జిల్లాలో ఎంతో మంది మంత్రులుగా పనిచేశారని, వాళ్లలో ఎవరైనా మంత్రి జగదీశ్‌​రెడ్డి చేసిన మంచి పనుల్లో ఒక్కటైనా చేశారా? అని ప్రశ్నించారు.  మంత్రి అల్ట్రా మెగాపవర్​స్టేషన్​ను పట్టుబట్టి దామరచర్లకు తీసుకొచ్చారని,  కృష్ణానది ఒడ్డున రూ.30వేల కోట్లతో నిర్మాణం జరిగే ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లా రూపురేఖలు మారుతాయని చెప్పారు.   

జగదీశ్​ రెడ్డిని గెలిపించండి

మంత్రి జగదీశ్​ రెడ్డి సూర్యాపేటలో ఎంత భారీ పనులు చేసిండో అంత భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కోరారు. మళ్లీ అధికారంలోకి వస్తే  ఉన్నత స్థానంలో ఉంటాడని చెప్పారు.  మంత్రి కోరిన డ్రైపోర్టుతో సహా ఇతర హామీలన్నింటిని నెరవేరుస్తానని సీఎం హామీ ఇచ్చారు.  

మూసీ ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ కాలంలో నాశ‌నం చేస్తే, గేట్లు కూడా ప‌ట్టిం చుకోక‌పోతే జ‌గ‌దీశ్ రెడ్డి వెంటబడి బాగు చేయించారని చెప్పారు. మూసీ , కాళేశ్వరం కింద పారుతున్న నీటికి నీటి తీరువాతో పాటు, పాత బ‌కాయిలు ర‌ద్దు చేశామన్నారు. ఈ స మావేశంలో ఎంపీ బడుగల లింగయ్య యాదవ్​, కాశోజు శంకరమ్మ, తది తరులు పాల్గొన్నారు. ​

మళ్లీ గెలిపిస్తే ఉపాధి,టూరిజం పైనే ఫోకస్​ 

సూర్యాపేట నియోజకవర్గాన్ని రూ.7,500 కోట్లతో అభివృద్ధి చేశా. కరువు ప్రాంతాన్ని కోనసీమ ప్రాంతంగా మార్చి చూపించినం. మళ్లీ గెలిపిస్తే ఉపా ధి, పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా.   యువతి ఉపాధి కొరకు వెయ్యి ఎకరాల్లో ఇండస్ట్రియల్​ పార్కు, డ్రై పోర్టు  ఏర్పా టు చేయిస్తా. మూడు వేల మందికి స్థానికంగానే ఉద్యోగాలు లభించేలా భారీ స్థాయిలో ఐటీ టవర్స్​ నిర్మాణం చేపడతా. సూర్యాపేట ప్రాంతంలోని ఉండ్రుగొండ, లింగమంతుల స్వామి టెంపుల్​, పిల్లల మర్రి దేవలయాలు, పరిగి బౌధ్ద క్షేత్రం, మూసీ  కలిపి ఒక టూరిస్ట్ సెంటర్‌‌గా మారుస్తం.   - మంత్రి జగదీశ్​ రెడ్డి

ALSO READ :  కామారెడ్డిలో హోరాహోరీ.. ముక్కోణపు పోటీలో గెలుపెవరిది?