
బోధన్, వెలుగు : నిజామాబాద్ జిల్లా ట్రాస్మా అధ్యక్షుడు కొడాలి కిషోర్ , ప్రతినిధులు రాజు, హరి బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పెండింగ్లో ఉన్న బకాయి స్కాలర్ షిప్లను విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల స్కాలర్ షిప్లు రాక ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. స్పందించిన సీఎం త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.