హైదరాబాద్, వెలుగు: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్స్ నిఖత్ జరీన్ (బాక్సింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), పీవీ సింధు (బ్యాడ్మింటన్) లను సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ లో అభినందించారు.
అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న ఇషా సింగ్ (షూటింగ్)కు కూడా సీఎం బెస్ట్ విషెస్ చెప్పారు. వారంతా తర్వాతి రౌండ్ లోను విజయం సాధించి దేశానికి మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు.