- రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్రిపబ్లిక్డే శుభాకాంక్షలు
హైదరాబాద్, వెలుగు: రిపబ్లిక్‌డే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభదినాన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టడం సంతోషకరమైన పరిణామ మని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్‌ను ప్రైడ్మరింత పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. గణతంత్ర దినోత్సవ శుభదినం సందర్భంగా మహనీయులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు.