పెట్టుబడులకు చైనా తర్వాత తెలంగాణానే బెస్ట్:సీఎం రేవంత్రెడ్డి

పెట్టుబడులకు చైనా తర్వాత తెలంగాణానే బెస్ట్:సీఎం రేవంత్రెడ్డి

కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చాయి.చైనాతో పాటు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని వ్యాపార వేత్తలు భావిస్తున్నారు.తెలంగాణ వడ్డించిన విస్తరి లాంటిది పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులు పెట్టేందుకు చైనా తర్వాత తెలంగాణానే బెస్ట్ ప్లేస్ అన్నారు. 

తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకే ఎంఎస్ ఎంఈ పాలసీని తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూని వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్కిల్ యూనివర్సిటీ లో పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు పెడతామన్నారు. 

తద్వారా గ్రామాల్లో ఉండే యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి . ప్రతియేటా లక్ష మంది ఇంజనీరు బయటకు వస్తున్నారు.. ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు ఉపయోగపడేలా చేస్తామ న్నారు సీఎం రేవంత్ రెడ్డి.