సీఎం రేవంత్​రెడ్డి రైతు పక్షపాతి : స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్​రెడ్డి

 సీఎం రేవంత్​రెడ్డి రైతు పక్షపాతి : స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్​రెడ్డి

కొడంగల్, వెలుగు: సన్న వడ్లకు రూ.500 బోనస్​ఇస్తూ సీఎం రేవంత్​రెడ్డి రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్​రెడ్డి అన్నారు. ఆదివారం కొడంగల్, పెద్దనందిగామాలో  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. దళారుల చేతిలో రైతు నష్టపోకుండా పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వికారాబాద్​జిల్లా లైబ్రరీ చెర్మెన్​రాజేశ్​రెడ్డి, నేతలు శివకుమార్, ప్రశాంత్​, సంజీవ్​రెడ్డి ఉన్నారు.