సీఎంకి స్వాగతం పలికిన కాంగ్రెస్​ నాయకులు

సీఎంకి స్వాగతం పలికిన కాంగ్రెస్​ నాయకులు

మనోహరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి సోమవారం మెదక్​ జిల్లా మనోరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ల్యాండ్​అయ్యారు. ఈ సందర్భంగా  మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ రాహుల్ రాజ్, సిద్దిపేట కలెక్టర్  మనుచౌదరి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిద్దిపేట సీపీ అనురాధ, ఎస్పీ ఉదయ్ కుమార్, అడిషనల్​కలెక్టర్ నగేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎలక్షన్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సీఎంకు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.