తెలంగాణను అవనిపై అగ్రభాగాన నిలుపుతం : సీఎం రేవంత్​ రెడ్డి

  • ఏడాది పాలనపై ఎంతో సంతృప్తిగా ఉన్నా: సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యా నికి రెడ్ కార్పెట్ పరిచి తెలంగాణను అవనిపై అగ్రభాగాన నిలిపేందుకు కృషిచేస్తున్నామని సీఎం రేవంత్ ​ రెడ్డి తెలిపారు. ఏడాది ప్రజాపాలనపై ‘ఎక్స్’ ​లో ఆయన ట్వీట్​ చేశారు. ‘‘4 కోట్ల ఆశయాలను నడిపిస్తూ నిరంతరం జ్వలించే  ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తి గా విరామం ఎరుగక, విశ్రాంతి కోరక ముందుకు సాగిపోతున్న. ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి. సమ స్త ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి.

పోరాటా లను, ఉద్యమాలను, త్యాగాలను, ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి నిరుడు డిసెంబర్ 7న తెలంగాణ నా చేతుల్లో పెట్టింది. తన వారసత్వాన్ని సగర్వంగా సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించింది. ఆ క్షణం నుంచి జన సేవకుడిగా ప్రజాసంక్షేమ శ్రామికుడిగా మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో సకల జనహితమే పరమావధిగా, జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా, సహచరుల సహకా రంతో జనహితు ల ప్రోత్సాహంతో విమర్శలను సహిస్తూ.. విద్వేషాలను ఎదురిస్తూ స్వేచ్ఛకు రెక్కలు తొడిగి ముందుకు వెళ్తున్న” అని సీఎం తన ట్వీట్ లో  పేర్కొన్నారు.