
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో నేడు జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ నుంచి ఉదయం 8.45 గంటలకు బయలుదేరి 10 గంటలకు బూర్గంపాడు మండలం ఐటీసీ సారపాక హెలీప్యాడ్ కు చేరుకుంటారు. గెస్ట్ హౌస్లో బస చేస్తారు. 10.30 గంటలకు భద్రాచలం బయలుదేరుతారు. 10.40 గంటల నుంచి 11 గంటల వరకు భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకుని పూజలు చేస్తారు.
11.10 గంటల నుంచి 12.30 గంటల వరకు మిథిలాస్టేడియంలో సీతారాముల కల్యాణంలో పాల్గొని స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం తరఫున అందజేస్తారు. 12.30 గంటలకు భద్రాచలం నుంచి సారపాకకు వెళ్తారు. 12.35 గంటల నుంచి 1.10 గంటల వరకు సన్నబియ్యం లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంట్లో మంత్రులతో కలిసి భోజనం చేస్తారు. 1.10 గంటలకు ఐటీసీ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. 2.15 గంటలకు బయలుదేరి సాయంత్రం 3.30 గంటల వరకు హైదరాబాద్కు చేరుకుంటారు.