ఏప్రిల్ 16 నుంచి సీఎం బృందం జపాన్ ​పర్యటన

ఏప్రిల్ 16 నుంచి సీఎం బృందం జపాన్ ​పర్యటన

హైదరాబాద్​, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న జపాన్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొననుంది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 22 వరకు టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలలో సీఎం బృందం పర్యటిస్తుంది. ఒసాకా వరల్డ్ ఎక్స్ పో –2025లో తెలంగాణ పెవిలియన్‌‌ను ప్రారంభించనున్నారు. జపాన్‌‌కు చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై చర్చలు జరుపనున్నారు.