సీఎం ఫొటోకు క్షీరాభిషేకం

సీఎం ఫొటోకు క్షీరాభిషేకం

కామారెడ్డిటౌన్, వెలుగు : గోరు బోలి ( లంబాడా) భాషను రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్​లో చేర్చేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా  తీర్మానం  చేసినందున కామారెడ్డిలో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం రేవంత్​రెడ్డి  ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.  

సంఘం స్టేట్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​  ప్రతాప్​ రాథోడ్ మాట్లాడుతూ లంబాడీ భాషాభిమానులకు గొప్ప వరమన్నారు.   బంజరా సేవా సంఘం  ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ సేనావత్ మోతిరాం,  ప్రతినిధులు ఆనంద్,  వినోద్,  శ్రీనునాయక్,  సదర్,  మోహన్​నాయక్,  రాధక్రిష్ణ,  శంకర్ పాల్గొన్నారు.