కేసీఆర్ రూ. 65 లక్షల జీతం, కారు తీసుకుని ఫామ్హౌజ్లో పడుకుండు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ రూ. 65 లక్షల జీతం, కారు తీసుకుని ఫామ్హౌజ్లో పడుకుండు : రేవంత్ రెడ్డి

ప్రతిపక్షపాత్ర పోషించకుండా తమను ప్రశ్నించే అర్హత కేసీఆర్ కు  లేదన్నారు సీఎం రేవంత్. 16 నెలల నుంచి అసెంబ్లీకి రాకుండా 60 లక్షల జీతం తీసుకుని ఫామ్ హౌజ్ లో పడుకున్నారని ధ్వజమెత్తారు రేవంత్. ప్రభుత్వ బంగ్లా తీసుకుని..కారు తీసుకుని ఎందుకు ప్రతిపక్షా పాత్ర పోషించడం లేదన్నారు.   ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఎందుకు వాళ్ల దగ్గరకు వెళ్లడం లేదన్నారు.

►ALSO READ | పదేళ్లు మాదే అధికారం.. ఫామ్హౌజ్లోనే కేసీఆర్ చరిత్ర పరిసమాప్తం: రేవంత్

గత ప్రభుత్వం తెచ్చిన ఏ పథకం ఆగిపోయిందో కేసీఆర్ చెప్పాలన్నారు రేవంత్. పెన్షన్లు ఆగిపోయాయా? రైతుబంధు ఆగిపోయిందా? ఫీజు రీయింబర్స్ మెంట్స్ నిలిచిపోయాయా?  కేసీఆర్ చర్చకు రావాలి.? కేసీఆర్ కళ్లల్లో మాటల్లో విషం కనిపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే పదేళ్లు అధికారం అనుభవించి ఇపుడు విలన్ అంటున్నారు అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.